Friday, March 21, 2008

'కరుణా' నీకిది తగునా?

'కరుణా' నీకిది తగునా!!!!!!!

నోటి దురద + పైత్యం + గుమ్మడి కాయంత వెర్రి = కరుణానిధి. వయసు మీద పడ్డ ఈ కురువ్రుధ్దుడుకి చూపుతో పాటు "మతి" మందగించినట్టుంది. ఈయన గారికి రాముడంటే ఎందుకో అంత మంట. "రావణ" సంతతి అధికారం చేపడితే ఇలాగే ఉంటుంది. పందికేం తెలుసు పాండ్స్ పౌడరు వాసన. ఈ భారతావనిలొ రాముడి గొప్పతనం పురుటిలోని బిడ్డకైనా తెలుస్తుంది కాని తలకాయలో మెదడు లేని వాడికేం తెలుస్తుంది. ఈ దేశంలొ పుట్టి, గద్దెనెక్కి విర్రవీగుతున్న "ఈనెల తక్కువ వాడి" కంటే విదేశి అయిన "మేడం" చాలా నయం. ఇది మన దౌర్భాగ్యం కాక మరేమిటి!!! మన రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తైనా ఒకమతం వారిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యంలు చేసినా శిక్షార్హుడౌతాడు. కాని ఇప్పుడు అలా జరుగుతుందా? లేదే. "శాంతి", "సహనం", "సమానత్వం" అంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ జీవితాన్ని వెల్లదీస్తున్న "మెజారిటి" ప్రజలకి జరగాల్సిన శాస్తే ఇది. హిందూ దేశం అంటూ మనల్ని మనం మోసం చేసుకొంటూ జీవితాల్ని వెల్లదెస్తున్న "మెజారిటి" బ్రతుకులు మనవి. ఈ హిందూ దేశంలో హిందూ అరాధ్య దేవుళ్ళని, దేవతలని వెటకారంగా వెక్కిరిస్తున్నా "శాంతి","సహనం" అంటూ మనల్ని మనం సర్దిచెప్పుకొని జీవితాల్ని వెల్లడీస్తున్న మనల్ని మనం ఏమనుకోవాలి? నోరు పారేసుకొనే ఇలాంటి నేతల్ని కట్టడి చేయలేమా? ఆ ఏకపత్నీ వ్రతుడు గురించి మాట్లాదే అర్హత ఈ భారతావనిలొ ఏ రాజకీయ నాయకుడికి లేదు.

Saturday, March 8, 2008

ఈసారీ ఆగని 'లాలూ ఎక్స్ ప్రెస్.

మనం ఏం పాపం చేసామోగాని 'లాలూ' మామయ్య మనమీద ఏమాత్రం జాలి చూపించ లేదు. ఎంతైనా 'దేవుడి ' పాలన కదా!!!. మన 'రాజు ' గారు ఎప్పుడు మన మొర ఆలకిస్తారో ఎప్పుడు ఈ నగ్న సత్యాన్ని గ్రహిస్తారో ఆ 'దేవుడి ' కే ఎరుక. కాస్త పక్కనే ఉన్న మన తంబిలు మాత్రం వాళ్ళకి కావల్సినవి ఎంచక్కా తీసుకొన్నారు. ఆదేమి విడ్డూరమోకాని కాని 'కాంగ్రెస్ ' పార్టీ విజయ బావుటా ఎగుర వేస్తుందంటే అది మన రాష్ట్ర ఎంపిల చలవే. అయినా అధికారాన్ని తీసుకెళ్ళి 'హైకమండ్ ' చేతిలొ పెట్టి భారాన్నంత 'దేవుడి ' పై వేసి 'అహా బడ్జెట్' బ్రహ్మాండం సుమీ అంటూ చంకలు కొట్టుకొనే 'రాజు ' గారి పాలనలొ ఉన్నాం మరి ఆమాత్రం చాస్తి వోట్లేసి గెలిపించిన ప్రతి తెలుగోడికి జరగాల్సిందే. 'సవితి ' బిడ్డలుగా ఉన్న ప్రతి తెలుగోడూ 'అసలు ' బిడ్డ ఎప్పుడౌతాడో!!!!!!!

Sunday, March 2, 2008

Hello everybody

అందరికీ స్వాగతం. ఈ మనలో మాట మనందరి భావాలకి ఒక వేదిక కావాలి. కొంచెం కారంగా కొన్వెం తియ్యగా...ఇక మొదలు పెడదామా!!!