Saturday, February 14, 2009

నాలుగు స్తంభాలాట!!!!

ఈసారి జరిగే ఎన్నికలు రాష్ట్రప్రజానీకానికి ఒక కొత్త అనుభూతిని మిగల్చనున్నాయి. ఇప్పడిదాక అటు "తెదేపా" ఇటు "కాంగ్రెస్" నువ్వా నేనా అంటూ ఇప్పటిదాకా అధికార పీఠం కోసం పోటీ పడ్డాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.Cuurent Trends ప్రకారం Congress కి మొన్నటివరకు వీచిన అనుకూల పవనాలు కాస్త మహాకూటమి వైపు వీస్తున్నాయి. స్తభ్దుగా వున్న TDP కి మహాకూటమి నూతనోత్సాహాన్నిచ్చింది. ఈ కూటమి ప్రభాం తప్పక Congress పై మరియు PRP పై తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కూటమి ఇప్పుడే పుట్టిన PRP,NTP లకి check పెట్టింది. ఇద్దరు "చంద్రులు" కలిసిన మహా కూటమి ఏమేరకు అధికారాన్ని చేజిక్కుంచుకొంటుందో వేచిచూద్దం.

Sunday, November 2, 2008

"స్నిగ్ధ" పై ఉగ్రవాది ముద్ర?

మాలేగావ్ పేలుళ్ళలో "స్నిగ్ధ" హస్థం అంటూ మీడియాలో వచ్చిన కథనాలపై అన్ని పార్టీలు అత్సుత్సాహాన్ని ప్రదర్శించాయనే చెప్పాలి. "హిందూ ఉగ్రవాది" అంటూ ముద్ర కూడా వేసేశారు. తమ రాజకీయ మనుగడ కోసం "మైనార్టీ" ఓట్ల కోసం ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టే ఈరాజకీయ నాయకుల్నేమనాలి? వీళ్లు ఉగ్రవాదులు కాదా? పార్లమెంటుపై దాడి సూత్రధారినేమనాలి? అఫ్జల్ ను ఉరి తీయకూడదంటూ ధర్నాలు రాస్తారోకోలు చేసి నానా హంగామా చేసిన ఈ రాజకీయనాయకులనేమనాలి? ఆగష్టు "15"న కాశ్మీర్లో భారత జాతీయ పతాకాన్ని పబ్లిక్ గా అగ్నికి ఆహుతి చేసినా కిక్కురుమనని మన గ్రేట్ పొలిటికల్ లీడర్స్ నేమనాలి? స్నిగ్ధ హిందువు కాబట్టి వీళ్ళంతా నానా యాగి చేస్తున్నారు. అదే మైనార్టీ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడితే, వీళ్ళ నోర్లు మోగేవా? ఓటు వేశే ప్రతి ఒక్క భారతీయుడు తనను తను ప్రశ్నించుకోవాలి. అసలైన ఉగ్రవాదులు మన రాజకీయ నాయకులు. వీరికి సరైన శిక్ష మనందరం వెయ్యాలి ఒక్క ఓటుతో!!!

Saturday, June 28, 2008

"దేవుడి పాలనలో కలం పై (రా)జులుం"

"ఆ రెండు పత్రికల" మీద "రాజు" గారికి మళ్ళీ కోపం వచ్చింది.ఆ రెండు పత్రికలపై ఏడుపు మరియు కడుపు మంట ఈ నాటిది కాదు. అయ్యవారు సింహాసనం అధిష్టించినప్పటినుంచీ "ఆ రెండు" పత్రికలమీద గుర్రు గానే ఉన్నారు. అయ్యగారి పాలన మరో ఔరంగజేబును తలపిస్తున్నా అయ్యగారి భజన చేయకుండా ఆ రెండు పత్రికలూ పాలనలోని లొపాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వటమే ఆ రెండు పత్రికలూ చేసిన పెద్ద తప్పు. అయ్యవారి చేసే పొరబాట్లకి "వంత" పాడక పొవటం "ఆ రెండు" పత్రికలు చేసిన క్షమించరాని నేరం.

"దేవుడి పాలన" అంటే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని ఆ రెండు పత్రికలమీదా బురద జల్లడమే. పుత్రరత్నంతో అత్యుత్సాహంగా రాజు గారు ఓ పత్రిక పెట్టిచ్చారు. మన"స్సాక్షి" లేని ఆ పత్రిక రాసేవన్నీ రాజు గారి "భజన" కథనాలే. ప్రజలు విజ్ఞానవంతులు. ఒక్క ఓటుతొ కొరడా ఝులిపించారంటే "రాజు" గారు కాదు వారి "జగం" కూదా తోక ముడవాల్సిందే.

పత్రికల గొంతు నొక్కడం (ఇందిర)అమ్మ దగ్గరనుంచి అందిపుచుకున్నట్టున్నారు మన రాజు గారు. రాజు గారు అంతటి సత్య హరిశ్చంద్రుడే ఐతే ఆ రెండు పత్రికలూ రాసే కథనాలపై వివరణ అడిగే హక్కు ఈ దేశంలొ ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఆ ధైర్యంలేని వాళ్ళే అడ్డగోలుగా "చర్యలు" చేపడతారు. వాల్లకి ప్రజలే బుధ్ధి చెబుతారు. వేచి చూద్దాం ఆ సుదినం కోసం!!!!!

Friday, March 21, 2008

'కరుణా' నీకిది తగునా?

'కరుణా' నీకిది తగునా!!!!!!!

నోటి దురద + పైత్యం + గుమ్మడి కాయంత వెర్రి = కరుణానిధి. వయసు మీద పడ్డ ఈ కురువ్రుధ్దుడుకి చూపుతో పాటు "మతి" మందగించినట్టుంది. ఈయన గారికి రాముడంటే ఎందుకో అంత మంట. "రావణ" సంతతి అధికారం చేపడితే ఇలాగే ఉంటుంది. పందికేం తెలుసు పాండ్స్ పౌడరు వాసన. ఈ భారతావనిలొ రాముడి గొప్పతనం పురుటిలోని బిడ్డకైనా తెలుస్తుంది కాని తలకాయలో మెదడు లేని వాడికేం తెలుస్తుంది. ఈ దేశంలొ పుట్టి, గద్దెనెక్కి విర్రవీగుతున్న "ఈనెల తక్కువ వాడి" కంటే విదేశి అయిన "మేడం" చాలా నయం. ఇది మన దౌర్భాగ్యం కాక మరేమిటి!!! మన రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తైనా ఒకమతం వారిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యంలు చేసినా శిక్షార్హుడౌతాడు. కాని ఇప్పుడు అలా జరుగుతుందా? లేదే. "శాంతి", "సహనం", "సమానత్వం" అంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ జీవితాన్ని వెల్లదీస్తున్న "మెజారిటి" ప్రజలకి జరగాల్సిన శాస్తే ఇది. హిందూ దేశం అంటూ మనల్ని మనం మోసం చేసుకొంటూ జీవితాల్ని వెల్లదెస్తున్న "మెజారిటి" బ్రతుకులు మనవి. ఈ హిందూ దేశంలో హిందూ అరాధ్య దేవుళ్ళని, దేవతలని వెటకారంగా వెక్కిరిస్తున్నా "శాంతి","సహనం" అంటూ మనల్ని మనం సర్దిచెప్పుకొని జీవితాల్ని వెల్లడీస్తున్న మనల్ని మనం ఏమనుకోవాలి? నోరు పారేసుకొనే ఇలాంటి నేతల్ని కట్టడి చేయలేమా? ఆ ఏకపత్నీ వ్రతుడు గురించి మాట్లాదే అర్హత ఈ భారతావనిలొ ఏ రాజకీయ నాయకుడికి లేదు.

Saturday, March 8, 2008

ఈసారీ ఆగని 'లాలూ ఎక్స్ ప్రెస్.

మనం ఏం పాపం చేసామోగాని 'లాలూ' మామయ్య మనమీద ఏమాత్రం జాలి చూపించ లేదు. ఎంతైనా 'దేవుడి ' పాలన కదా!!!. మన 'రాజు ' గారు ఎప్పుడు మన మొర ఆలకిస్తారో ఎప్పుడు ఈ నగ్న సత్యాన్ని గ్రహిస్తారో ఆ 'దేవుడి ' కే ఎరుక. కాస్త పక్కనే ఉన్న మన తంబిలు మాత్రం వాళ్ళకి కావల్సినవి ఎంచక్కా తీసుకొన్నారు. ఆదేమి విడ్డూరమోకాని కాని 'కాంగ్రెస్ ' పార్టీ విజయ బావుటా ఎగుర వేస్తుందంటే అది మన రాష్ట్ర ఎంపిల చలవే. అయినా అధికారాన్ని తీసుకెళ్ళి 'హైకమండ్ ' చేతిలొ పెట్టి భారాన్నంత 'దేవుడి ' పై వేసి 'అహా బడ్జెట్' బ్రహ్మాండం సుమీ అంటూ చంకలు కొట్టుకొనే 'రాజు ' గారి పాలనలొ ఉన్నాం మరి ఆమాత్రం చాస్తి వోట్లేసి గెలిపించిన ప్రతి తెలుగోడికి జరగాల్సిందే. 'సవితి ' బిడ్డలుగా ఉన్న ప్రతి తెలుగోడూ 'అసలు ' బిడ్డ ఎప్పుడౌతాడో!!!!!!!

Sunday, March 2, 2008

Hello everybody

అందరికీ స్వాగతం. ఈ మనలో మాట మనందరి భావాలకి ఒక వేదిక కావాలి. కొంచెం కారంగా కొన్వెం తియ్యగా...ఇక మొదలు పెడదామా!!!