Sunday, November 2, 2008

"స్నిగ్ధ" పై ఉగ్రవాది ముద్ర?

మాలేగావ్ పేలుళ్ళలో "స్నిగ్ధ" హస్థం అంటూ మీడియాలో వచ్చిన కథనాలపై అన్ని పార్టీలు అత్సుత్సాహాన్ని ప్రదర్శించాయనే చెప్పాలి. "హిందూ ఉగ్రవాది" అంటూ ముద్ర కూడా వేసేశారు. తమ రాజకీయ మనుగడ కోసం "మైనార్టీ" ఓట్ల కోసం ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టే ఈరాజకీయ నాయకుల్నేమనాలి? వీళ్లు ఉగ్రవాదులు కాదా? పార్లమెంటుపై దాడి సూత్రధారినేమనాలి? అఫ్జల్ ను ఉరి తీయకూడదంటూ ధర్నాలు రాస్తారోకోలు చేసి నానా హంగామా చేసిన ఈ రాజకీయనాయకులనేమనాలి? ఆగష్టు "15"న కాశ్మీర్లో భారత జాతీయ పతాకాన్ని పబ్లిక్ గా అగ్నికి ఆహుతి చేసినా కిక్కురుమనని మన గ్రేట్ పొలిటికల్ లీడర్స్ నేమనాలి? స్నిగ్ధ హిందువు కాబట్టి వీళ్ళంతా నానా యాగి చేస్తున్నారు. అదే మైనార్టీ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడితే, వీళ్ళ నోర్లు మోగేవా? ఓటు వేశే ప్రతి ఒక్క భారతీయుడు తనను తను ప్రశ్నించుకోవాలి. అసలైన ఉగ్రవాదులు మన రాజకీయ నాయకులు. వీరికి సరైన శిక్ష మనందరం వెయ్యాలి ఒక్క ఓటుతో!!!

No comments: