Saturday, June 28, 2008

"దేవుడి పాలనలో కలం పై (రా)జులుం"

"ఆ రెండు పత్రికల" మీద "రాజు" గారికి మళ్ళీ కోపం వచ్చింది.ఆ రెండు పత్రికలపై ఏడుపు మరియు కడుపు మంట ఈ నాటిది కాదు. అయ్యవారు సింహాసనం అధిష్టించినప్పటినుంచీ "ఆ రెండు" పత్రికలమీద గుర్రు గానే ఉన్నారు. అయ్యగారి పాలన మరో ఔరంగజేబును తలపిస్తున్నా అయ్యగారి భజన చేయకుండా ఆ రెండు పత్రికలూ పాలనలోని లొపాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వటమే ఆ రెండు పత్రికలూ చేసిన పెద్ద తప్పు. అయ్యవారి చేసే పొరబాట్లకి "వంత" పాడక పొవటం "ఆ రెండు" పత్రికలు చేసిన క్షమించరాని నేరం.

"దేవుడి పాలన" అంటే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని ఆ రెండు పత్రికలమీదా బురద జల్లడమే. పుత్రరత్నంతో అత్యుత్సాహంగా రాజు గారు ఓ పత్రిక పెట్టిచ్చారు. మన"స్సాక్షి" లేని ఆ పత్రిక రాసేవన్నీ రాజు గారి "భజన" కథనాలే. ప్రజలు విజ్ఞానవంతులు. ఒక్క ఓటుతొ కొరడా ఝులిపించారంటే "రాజు" గారు కాదు వారి "జగం" కూదా తోక ముడవాల్సిందే.

పత్రికల గొంతు నొక్కడం (ఇందిర)అమ్మ దగ్గరనుంచి అందిపుచుకున్నట్టున్నారు మన రాజు గారు. రాజు గారు అంతటి సత్య హరిశ్చంద్రుడే ఐతే ఆ రెండు పత్రికలూ రాసే కథనాలపై వివరణ అడిగే హక్కు ఈ దేశంలొ ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఆ ధైర్యంలేని వాళ్ళే అడ్డగోలుగా "చర్యలు" చేపడతారు. వాల్లకి ప్రజలే బుధ్ధి చెబుతారు. వేచి చూద్దాం ఆ సుదినం కోసం!!!!!

No comments: